మన్యం న్యూస్,అశ్వాపురం:
మండల కేంద్రానికి సమీపంలోనిచౌటీ గూడెం గ్రామంలో రూ. 16 లక్షల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా అక్కడి గ్రామస్తులు ఇళ్లలో వాడుకున్న నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వారి ఇళ్ల ముందే నిల్వ ఉంటున్నాయి. ఇంట్లోంచి బయటికి వస్తే మురికి వాసన భరించలేకపోతున్నామని వారు ఆవేదన వెలుబుచ్చారు. ఇళ్లల్లో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని , రోగాల బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. డ్రైనేజీ మురుగు నీరుని బయటికి పంపించే పరిష్కారం చూపించాలని పంచాయతీ ప్రజలు అధికారులను కోరడమైనది. కాగా ఇదే విషయమై సెక్రటరీ కృష్ణ చైతన్యను మన్యం న్యూస్ వివరణ కోరగా సోమవారం డ్రైనేజ్ వాటర్ క్లియర్ చేయడంతోపాటు బ్లీచింగ్ నిర్వహిస్తామని తెలిపారు.