మన్యంన్యూస్ ,వెంకటాపురం:
మండలంని అంకన్నగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ గుండెపోటుతో మృతిచెందగా మిగిలిన యాత్రికులు సురక్షితంగా బయటపడ్డ విషయం విధితమే. కాగా మాలదారులుశుక్రవారం సాయంత్రం నుండి శనివారం వరకు మండల కేంద్రంలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో బస చేశారు. ఈ నేపథ్యంలో వెంకటాపురం మండల కేంద్రంలోని దిశా ఫౌండేషన్ వారు ఈ విషయం తెలుసుకొని యాత్రికులకు శనివారం ఉదయం పండ్లు అల్పాహారం ఏర్పాటుచేసి వారి పట్ల మానవత్వం చాటుకున్నారు. యాత్రికుల్లో ఓం శక్తి మాలాదారులు మహిళ లే ఎక్కువగా ఉండడంతో వారికి కావాల్సిన సౌకర్యాలు దిశ ఫౌండేషన్ వారు ఏర్పాటుచేసి వారికి తోడుగా నిలిచారు.ఈ కార్యక్రమంలో దిశా ఫౌండేషన్ అధ్యక్షులు పిల్లల లీలారాణి, సభ్యులు సుహాసిని తదితరులు పాల్గొన్నారు.