మన్యం న్యూస్, మంగపేట:మండలం లోని
మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి వారిని
ఆదివారం ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, దంపతులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు, గర్భాలయంలో
కలెక్టర్ దంపతుల పేరుతో
స్వామి వారి కి తిల,తైలాభిషేకం
నిర్వహించి స్వామి వారి విశిష్టత వివరించి తదనంతరం ఆశ్వీర్వచనం చేసిస్వామి వారి తీర్థప్రసాదాలు శేషవస్ర్తాలు అందచేసారు.
ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య వెంట మంగపేట ఎంఆర్ఓ శ్రీనివాసరావు,
ఆర్ ఐ కుమారస్వామి,
ఆలయ రెన్యూలేషన్ కమిటీ చైర్మన్ నూతులకంటి ముకుందం
అర్చకులు రాఘవ చార్యులు.
రాజశేఖర్ శర్మ,పవన్ కుమారచార్యులు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.