ప్రతి కుటుంబానికి అండ.. గులాబీ జెండా..
– అభివృద్ధికి ఫలితంగా పార్టీ బలోపేతం
– గ్రామాల అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
మన్యం న్యూస్, సారపాక :
ప్రతి కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఆదివారం మండల పరిధిలోని ఉప్పుసాక గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో పలు పార్టీల నుంచి సుమారు 400 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వారికి గులాబీ కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలుకు ఆకర్షితులై, ఫలితంగా వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నిత్యం పేద ప్రజల, రైతుల, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన ఇంతటి అభివృద్ధి, ఇలాంటి పరిపాలన చేసిన సీఎం ఎవరు లేరని ప్రజలు గ్రహించి సీఎం కేసీఆర్ చేసే అభివృద్ధికి ప్రజల ఆనందాన్ని తెలుపుతున్నారు. సిఎం పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రతి కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు పట్టణాలు రూపురేఖలు మారిపోయాయని అన్నారు. మన ఊరు మనబడి ద్వారా 7281 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి వివిధ రకాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా 100 కోట్లు ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్, బూర్గంపాడు మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీ, బూర్గంపాడు మండలం యువజన విభాగం అధ్యక్షులు గోనెల నాని, పార్టీ సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు భానోత్ శ్రీను తదితర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.