UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 గోర్ మాటి ఆత్మీయ సమ్మేళనం విజయవంతం.. సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న బంజారాలు..

 

మండల కేంద్రంలో భారీ ర్యాలీ..

మన్యం న్యూస్ : జూలూరుపాడు, జనవరి 8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆదివారం జూలూరుపాడు మండల కేంద్రంలో గోర్ మాటి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద నుండి భారీ ర్యాలీగా బయలుదేరి బంజారాల సాంప్రదాయ వస్త్ర అలంకరణతో, నృత్య ప్రదర్శనలతో మండల కేంద్రంలో సాగిన ర్యాలీ చూపరులను ఆకట్టుకుంది. అనంతరం కస్తూరిబా గాంధీ పాఠశాల ఎదురుగా ఉన్న మామిడి తోటలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయాలకు అతీతంగా పాల్గొని లంబాడి జాతి కీర్తిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా బానోతు విజయబాయి మాట్లాడుతూ.. అగ్రవర్ణ కులాల వారు లంబాడి జాతిని అనగ తొక్కాలని, లంబాడీలకు రిజర్వేషన్ కల్పించకూడదని, ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, అలాంటి వారిని లంబాడి జాతి నాయకులు ఒకే తాటి పైకి వచ్చి మన జాతి కీర్తిని పెంచాలని ఆమె కోరారు. ధరావత్ రామ్మూర్తి నాయక్ మాట్లాడుతూ.. ఈ గోర్ మాటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ముందు ముందు ఇలాగే కొనసాగించాలని, లంబాడా సోదరులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !