మన్యం న్యూస్,పినపాక:
మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు ఆదివారంజరిగింది. ఈ కార్యక్రమానికి మణుగూరు జడ్జి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగాహాజరై మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి న్యాయ విషయాల పట్ల కనీస అవగాహన ఉండాలని, సంబంధిత విషయాలపై కోర్టును సంప్రదించి సందేహాలను ఉచితంగా నివృత్తి చేసుకోవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం సిఐ రాజగోపాల్, ఎస్ఐ టీవీ ఆర్ సూరి , ఎంపీటీసీ ఖాయం శేఖర్ , సర్పంచ్ ఈసంభవతి, ఉప సర్పంచ్ సాంబశివరావు, అమరారం సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, న్యాయవాది మూర్తి తదితరులు పాల్గొన్నారు.