మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 08: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి కట్టుగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు అన్నారు. ఆయన ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి పినపాక నియోజకవర్గ గడ్డ మీద అందరూ కష్టపడి గతంలో లాగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అరాచక, నియంత పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకే ప్రజల మద్దతు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే పేద,బడుగు బలహీనవర్గాల ప్రజలకు,రైతులకు,నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
