..
మన్యంన్యూస్, మణుగూరు, జనవరి 07: గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సంఘటన మణుగూరు లో శనివారం రాత్రి చోటుచేసుకుంది… పోలీసులు తెలిపిన వివరాలు ఇలా. రైల్వే గేట్ కూనవరం వద్ద గంజాయి అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మణుగూరు సి.ఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ రాజకుమార్ తన సిబ్బందితో కలిసి రైల్వే గేట్ కూనవరం వద్ద బైక్ పై 3 కేజీల గంజాయి తెచ్చి ముగ్గురు వ్యక్తులు అమ్ముతుండగా సుందరయ్య నగర్ కు చెందిన
గడ్డం పవన్ కుమార్, విప్పల సింగారంకు చెందిన కనితి చందు, పైలట్ కాలనీకి చెందిన పఠాన్ ఫిరోజ్ ఖాన్ లను అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ దాడుల్లో రామకృష్ణ, బికోజి, సత్యనారాయణ, పుల్లం దాస్ లు పాల్గొన్నారు.