క్రీడా కారులకు నోరూరించే వంటకాలు….
-ఉదయం టిఫిన్, రెండు పూటలా కడుపునిండా భోజనం.
– దగ్గరుండి వంటలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రేగా.
మన్యంన్యూస్, మణుగూరు, జనవరి 08: రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మణుగూరులో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు నోరూరించే వంటకాలను తయారు చేపించి పెడుతున్నారు. రకరకాల వంటలతో కడుపునిండా భోజనం పెడుతున్నారు. ఎప్పుడు ఎవరు చేయని విధంగా పెద్ద ఎత్తున భోజనాలను ఏర్పాటు చేయడమే గాక రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్వయంగా దగ్గరుండి వంటకాలను పరిశీలించారు. క్రీడాకారులకు చక్కని భోజనం అందించాలని ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.