మన్యం న్యూస్,అశ్వాపురం జనవరి 9:
మండల పరిధి ఎలకలగూడెం గ్రామానికి చెందిన కలేటి నాగేశ్వరావు కు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్దం అయిన విషయం విధితమే .నిరుపేద గిరిజన కుటుంబం వారిది. కట్టుకునే బట్టలతో సహా కాలి బూడిదయ్యాయి.
ఈవిషయం తెలుసుకున్న అశ్వాపురం ఆదివాసి జాక్ సభ్యులు బాధిత కుటుంబ సభ్యులకు బియ్యం 50 కేజీలు,రూ.5వేలు వితరణగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కలేటి నరసింహారావు, ఆదివాసి ఐకాస మండల అధ్యక్షుడు కుంజ రామారావు, మండల పిసా అధ్యక్షుడు చాప ముత్తయ్య, సర్పంచులు బట్ట సత్యనారాయణ, మడకం సాదు, బొర్రా శీను ,కోరెం రామారావు, పాయం సర్వేశ్వరరావు, కొర్స దుర్గారావు ,బండ్ల సూరిబాబు, తంగెళ్ల భద్రయ్య ,బుర్కా అశోక్ తదితరులు పాల్గొన్నారు.
