కళ్యాణి లక్ష్మి ఆడబిడ్డలకు వరం : జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
– కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ.
మన్యం న్యూస్ బూర్గంపహాడ్ జనవరి 09: మండలంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీ లత పాల్గొని చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి ప్రభుత్వ పథకాలు ఆడబిడ్డలకు వరం లాంటి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు సోమవారం బూర్గంపహాడ్ తాసిల్దార్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఈ సందర్బంగా కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పధకం దేశానికి ఆదర్శం అని, మహిళలును ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు, కల్యాణ లక్ష్మి పధకాన్ని సద్వినియోగం చేసుకొవాలి సూచించారు, బి ఎస్ ఆర్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అన్నారు, కల్యాణ లక్ష్మి పధకం తో పెదింటి ఆడబిడ్డల పెండ్లి కి రూ.1,00,116/-రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది అన్నారు. మహిళలు సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది అన్నారు. రాష్టం లో మహిళల సంక్షేమమం కొరకు అనేక చర్యలు తీసుకుంటుంది గుర్తు చేశారు. మహిళల కోసం ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేపడుతుంది అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకొని మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని సూచించారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, గర్భిణీలుగా బాలింతలు చిన్నారుల కోసం న్యూట్రీషియన్ కిట్లను తెలంగాణ ప్రభుత్వం అందించిస్తుంది అని సూచించారు, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతానికి తెలంగాణ కృషి చేస్తుంది అన్నారు, ఈ కార్యక్రమం లో బూర్గంపహాడ్ తహసీల్దార్ భగవాన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పొడియా ముత్యాలమ్మ, మండల బి ఎస్ ఆర్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండల ఉపాధ్యక్ష లు మొండెడ్డుల వేంకటేశ్వర రెడ్డి మండల యువజన అధ్యక్షులు గొనెల నాని, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్.కె సాదిక్ పాష, ఉపాధ్యక్షులు గుల్ మొహ్మద్, ఏఎంసి డైరెక్టర్ శ్రీను నాయక్, మండల ఎస్సీ అద్యక్షులు వలదసు సలయ్యా, మండల పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు గంగపురి చంద్రశేఖర్ మండల టౌన్ అధ్యక్షులు సోహెల్ పాషా, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మంద ప్రసాద్, బుపల్లి నరసింహ రావు, జక్కం సర్వేశ్వర రావు, కొంకంచి శ్రీను, బిట్ర సాయిబాబు, జక్కం శ్రీను, కేసుపక రమేష్, పార్టీనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.