- అయ్యో “పొంగు “లేటి
- కమలం వికాసమా.. పరిహాసమా
- కారు దిగి కమలం వైపుకు పొంగులేటి
- ఏం చేద్దాం చెప్మా..
- అంతర మదనంలో కార్యకర్తలు
- నిర్ణయం వెనుక నిగూడా అర్థమేంటి..?
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 09.. హమ్మయ్య ఉత్కంఠానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెర లేపుతున్నారని తెలుస్తుంది. ఇంతకాలం అధికార పార్టీలో తనదైన శైలిలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతుంది. అధికార పార్టీ బి ఆర్ ఎస్ కావాలనే పక్కన పెట్టిందా… శీనన్న వ్యక్తిగత పోకడలకు అధికార పార్టీ చెక్కు పెట్టిందా తెలవదు గాని.. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్న ఊహాగానాలకు మాత్రం త్వరలో తేటతెల్లమయ్యే పరిస్థితి ఎదురైయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేనొక వ్యక్తిని కాదు శక్తిని అంటూ గతంలో అధికార పార్టీ తరఫునుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శాసించిన పొంగులేటి ప్రస్తుతం వేరే గూడు వెతుక్కున్నారంటే.. తెరపైకి వచ్చిన ఈ పరిమాణాలు బి ఆర్ ఎస్ అధిష్టాన వర్గం తీసుకుంటున్న కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు హాట్ టాపిక్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , ఖమ్మం జిల్లా తో కలుపుకొని చర్చాంశ నియమయింది. ప్రస్తుతం జై శీనన్న జై తెలంగాణ అన్న కార్యకర్తల నినాదంలో స్వరం కొంత బంగపడింది. గతంలో కార్యకర్తలు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో కొనసాగుతారని అంతు బట్టని ప్రశ్నగా మిగిలిన సందర్భంలో మన్యం న్యూస్ పాఠకులకు ఆనాడే చెప్పింది.” శీనన్న తేల్చన్న” అనే కథనం సంచలనం రేపింది. అందరూ ఊహించినట్లుగానే అధికార పార్టీ బీఆర్ఎస్ లో కొనసాగలేని పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని, నమ్ముకున్న నాయకత్వం ఎటు పోవాలో తెలియక అయోమయంలో పడ్డారని పాఠకులకు తెలిసిందే. త్వరలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బిజెపి పార్టీలో చేరి కమల దరహాసం చేస్తానని మాజీ ఎంపీ పొంగులేటి తీసుకున్న నిర్ణయం వెనక కమలం పరిహాసమా..? దరహాసం..? తేల్చుకోలేని పరిస్థితిలో కార్యకర్తలు కూడా ఊహల పల్లకిలో ఊగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరికి వారే సొంత కుంపట్లను ఏర్పాటు చేసుకొని ఆత్మీయ సమ్మేళనాలను జరుపుకొని వారి వారి బలాల ప్రయోగాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. గతంలో మాజీ ఎంపీ పొంగులేటి మాత్రం ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని… వేరే పార్టీకి పోతారని అనుకున్న క్రమంలో ఇవన్నీ వట్టి మాటలు అని కొట్టి పారేసిన పొంగులేటి తీసుకుంటున్న నిర్ణయాలు అటు ప్రజలకు కార్యకర్తలకు పొంగులేటి పై ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది అనేది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇదే తరహాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ఖమ్మంలో జరిగిన తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభకు గతంలో ఆ పార్టీ తరఫున పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు మళ్లీ వస్తున్నాడని తెలుగుదేశం తరఫున పోటీ చేయటం తధ్యమని అటు కార్యకర్తలు ప్రజలు చర్చించుకున్న తీరు సంచలనం రేపింది. అయితే వీరిద్దరూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కెసిఆర్ వీరిద్దరికి ఒక సముచితమైన స్థానాన్ని కల్పించి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బి ఆర్ ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగేందుకు దోహదపడ్డారు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా తుమ్మల గుమ్మం ఎటువైపు.. పొంగులేటి పరుగు కమలం వైపు.. వెళుతున్నారనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కెసిఆర్ మాటే శాసనంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సారధ్యంలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేలను కలుపుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాన్ని అనుసరిస్తూ ఆ పార్టీ తరపున పోటీ చేసే వ్యక్తులను గెలిపించుకునేందుకు తనదైన శైలిలో వ్యూహాత్మకంగా ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలను రూపొందించుకోవడం విశేషం. ఇంతకాలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిజెపి జెండాను భుజాన మోసిన కార్యకర్తలు గాని ముఖ్య నేతలు గాని ఆలోచనలో పడ్డారు. గద్ద వచ్చి కోడిపిల్లను తన్నుకు పోయినట్టు ఇంతకాలం ఆ పార్టీ తరపున శ్రమించిన నాయకులకు సముచితమైన స్థానం కలుగుతుందని ఆశగా ఎదురుచూసిన ముఖ్య నేతలకు చుక్క ఎదురయ్యే పరిస్థితి నెలకొనడంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలో పోటీ చేసే అభ్యర్థుల గెలుపు ప్రశ్నార్ధకంగా మారింది అనడంలో సందేహం లేదు.