- రైతుల కళ్ళాలకు, ప్రజల అవసరాలకు ఇసుక తోలకాలకు కచ్చితంగా ఎమ్మార్వో అనుమతులు ఇవ్వాలి.
- సిపిఐ ఎంఎల్ ప్రజా పదం పార్టీ
- భద్రాద్రి జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి
మన్యం న్యూస్ చర్ల,జనవరి 09:
చర్ల మండలం లోని సుందరయ్య కాలనీ గ్రామంలో సిపిఐ ఎం ఎల్ ప్రజా పదం పార్టీ చర్ల మండల కమిటీ సమావేశం సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పార్టీ జిల్లా కార్యదర్శి కేచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ చర్ల మండలంలో ఇసుక మట్టి గ్రావెల్ ప్రజా సంపద లూటీ కి గురి అవుతుందని అన్నారు. చర్ల మండల అధికారుల మెతక వైఖరి వల్ల పర్యవేక్షణ లోపంవల్లే ప్రజా సంపద దోచుకోవడం జరుగుతుందని దీన్ని ప్రజాపంధ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కలెక్టర్ చొరవ తీసుకొని ఈ అక్రమ రవానాలకు అడ్డు కట్ట వెయ్యాలని కోరారు,రైతుల కళ్ళాలకు, ప్రజల అవసరాలకు అవసరం ఐన ఇసుక తోళకాలకు కచ్చితంగా ఎమ్మార్వో అనుమతులు ఇవ్వాలనీ,రైతుల పేరు చెప్పి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని కట్టినంగా శిక్షించాలనీ అక్రమ0గా మట్టి , ఇసుక, గ్రావెల్ తోవ్వకాలు, రవాణాలు జరిపే వాహనాలను సీజ్ చెయ్యాలనీఅక్రమరవాణా దారులకు కొమ్ముగాస్తున్న అధికారులను గుర్తించి సస్పెండ్ చెయ్యాలనీ కొండా చరణ్ పై చర్ల ఎమ్మార్వో చేసిన తప్పుడు పిర్యాదు నీ ఖండించండి,ప్రజాసంపథ రక్షణకై ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలి అన్నారు..ఈ సమావేశంలో పార్టీ డివిజన్ నాయకులు సాయన్న పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్ పార్టీ మండల నాయకులు లంకా వెంకట్, ముసలి సతీష్ , రేగా ఆంద్రయ్యా, కౌశిక్, పాముల సాంబ తదితరులు పాల్గొన్నారు.