మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి 09 : మండల వ్యవసాయశాఖ విస్తర్ణాధికారులు సాయిబాను, విజయ లపై జిల్లా కలెక్టర్ అనుదీప్ కు సోమవారం మండల రైతులు గ్రీవెన్స్ లో పిర్యాదు చేశారు.మండలానికి చెందిన రైతులు ఆంగోతు భద్రు,బట్ట పెద్దులు, ధరావత్ ధంజ్యా, ధరావత్ దాసు, ధరావత్ రంగమ్మ, ధరావత్ రుక్కి, ధరావత్ అర్జునలు రూ.58వేలు ఎన్ఎఫ్ఎస్ఎం స్కీం క్రింద నగదు ఏఈఓలు సాయిబాను, విజయ్ లకు కట్టారు. నాటి నుంచి నేటి వరకు నగదు తిరిగి ఇవ్వలేదు. స్కీం క్రింద పంపులు ఇవ్వలేదు. రైతుల నుంచి అధికమొత్తంలో డిడిలు తీసిన దానికంటే వేల రూపాయలు అధికంగా వసూలు చేసినారు. ఐదేండ్లు గడుస్తున్న సరియైనా సమాధానం రైతులకు ఇవ్వకపోవడంతో రైతులు విసుకుచెందారు. దీంతో రైతులు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయటంతో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అభిమన్యుడికి పిర్యాదుపై విచారణ చేసి, రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఏఈఓలపై తరచూ రైతుల నుంచి పిర్యాదులు వస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఉన్నతాధికారులకు సైతం అవినీతిలో భాగం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.