మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి జనవరి 09 : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఎంపీపీ సున్నం లలిత అధ్యక్షతన జరిగిన మండల స్థాయి కంటి వెలుగు కార్యక్రమం సోమవారం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపీపీ మట్లాడుతూ కంటి చూపుతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ నెల18 న విజయవంతం చేయాలని ఆమె కోరారు.అనంతరం కంటి వెలుగు పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం భారత లావణ్య, ఎర్రగుంట పీహెచ్సి డాక్టర్ ప్రియాంక, తహసిల్దార్ భద్రకాళీ, మండల పంచాయతీ అధికారిని షభాన,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.