- యువత పోటీ తత్వంతో రాణించాలి సిఐ వసంత్ కుమార్..
- ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నాలుగు మండలాల స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన సర్కిల్ ఇన్ స్పెక్టర్..
మన్యం న్యూస్ , జూలూరుపాడు, జనవరి 9, , క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, నేటి ప్రపంచంలో యువత పోటీ తత్వంతో రాణించాలని జూలూరుపాడు సిఐ వసంత్ కుమార్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాలుగు మండలల స్థాయి క్రికెట్ పోటీలను ఎస్సై పోటు గణేష్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, యువత మంచి మార్గాలను ఎంచుకొని పోటీ ప్రపంచంలో రాణించాలని కోరారు. ఎస్సై పోటు గణేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నోటిఫికేషన్ల ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని, యువకులు పట్టుదలతో సాధిస్తే విజయ అవకాశాలుంటాయని, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా, సన్మార్గంలో నడిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రీడలు నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ యూత్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, నిర్వాహకులు చలగొండ్ల సతీష్, జాలాది అవినాష్, కల్లోజి నరేష్, హాలవాత్ వంశి, క్రీడాకారులు పాల్గొన్నారు.