మన్యం న్యూస్ గుండాల జనవరి 09: గుండాల ఎంపీటీసీ సంధాని జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ క్రీడా పోటీలలో యువత పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు దనసరి సూర్య కోరారు. సోమవారం మండల కేంద్రంలో క్రికెట్ క్రీడా పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ప్రజల మనిషిగా పిలవబడే సంధాని మన మధ్యలో లేకపోయినా ఆయన ఎప్పటికీ ప్రజల గుండెలలో నిలిచి ఉంటారని అన్నారు. ఉత్సాహంగా క్రికెట్ పోటీలలో పాల్గొని తమ సత్తాను యువత నిరూపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కిన్నెర రాజశేఖర్ ,సర్పంచులు సీతారాములు, ముత్యమాచారి, ఫారెస్ట్ రేంజర్ మురళి, వివేకవర్ధని ప్రిన్సిపల్ వరలక్ష్మి,కోడెం వెంకటేశ్వర్లు, తుడుం దెబ్బ మండల కార్యదర్శి నరసింహారావు, ఎస్కే సాహెబ్, యూత్ ఎస్కే ఆజాద్ ,సురేష్ , సంతోష్, జంపరాజు, శివాజీ, బొబ్బిలి పవన్ కళ్యాణ్, వెంకీ, ప్రణయ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు