మన్యం న్యూస్ గుండాల, జనవరి 09 ..కస్తూరిబా పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్స్ ల సమస్యలను పరిష్కరించాలని ఇఫ్టు జిల్లా నాయకులు సారంగపాణి కోరారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో ఇఫ్టు ఆధ్వర్యంలో నిర్వహించే మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈనెల 11వ తేదీన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభ నిర్వహించడం జరుగుతుందని ఈ సభకు వర్కర్స్ అసోసియేషన్ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వ్యాసారపు వెంకన్న, మానాల ఉపేందర్, పిడిఎస్యు జిల్లా నాయకులు రాజేష్ , శైలజ, కవిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు