UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 తొలితరం సంస్కర్త , విద్యాజ్యోతి ఫాతిమా సీనియర్ జర్నలిస్ట్ యండి. ఉస్మాన్ ఖాన్

మన్యం న్యూస్. ములకలపల్లి. జనవరి 09… అట్టడుగు వర్గాలను విద్యకు దూరం చేసిన అజ్ఞాన సమాజంలో విద్యాభివృధ్ధికి అలుపెరుగని పోరాటం చేసిన తొలితరం సంఘ సంస్కర్త, తొలి మైనారిటీ విద్యావేత్త ఫాతిమా షేక్ అని సీనియర్ జర్నలిస్ట్ యండి. ఉస్మాన్ ఖాన్ అన్నారు. సావిత్రిబాయి పూలేతో కలిసి సంఘసంస్కరణకోసం, ముఖ్యంగా దళితులు, మహిళల విద్యాభివృధ్ధికోసం పనిచేశారన్నారు. పూలే దంపతులను వారి కుటుంబ సభ్యులు ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు వారిని అక్కున చేర్చుకొని, తమ ఇంట్లో ఆశ్రయమిచ్చి, ఏకంగా తమ ఇంటినే పాఠశాలగా మార్చిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. శూద్రులు చదువుకోకూడదని మనువాదులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఫాతిమా, సావిత్రీ భాయి ఏమాత్రం భయపడకుండా వారిని ఎదిరించి బహుజనులందనీ చైతన్యపరిచి, వారికి అక్షర జ్ఞానం ప్రసాదించారన్నారు. 1848 లో సోదరుడు ఉస్మాన్ షేక్ సహకారంతో జ్యోతీరావుపూలే , సావిత్రీబాయి, ఫాతిమా షేక్ లు దళితులు, మహిళల కోసం విద్యాసంస్థను నెలకొల్పారని, ఆక్రమంలో వారు మనువాదులు, మతోన్మాదులనుండి అనేక అవమానాలు ఎదుర్కొన్నారని చెప్పారు. అనేక దశాబ్దాల పోరాటం తరువాత సావిత్రీబాయి పూలేకు తగిన గుర్తింపు లభించిందని, ఫాతిమా షేక్ ఇంకా విస్మృత విద్యావేత్తగానే మిగిలి పోయారని, ఇప్పుడిప్పుడే ఆలోచనాపరులు చరిత్రను గుర్తించగలుగుతున్నారని, ఇది శుభపరిణామమన్నారు. ఈనాడు బహుజనులు విద్యాపరంగా అంతో ఇంతో ముందడుగు వేస్తున్నారంటే అది సావిత్రీబాయి, ఫాతిమా షేక్ ల పుణ్యమేనని గుర్తుంచుకోవాలన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !