మన్యంన్యూస్, మణుగూరు, జనవరి 09: మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వలస ఆదివాసీ గిరిజన గ్రామాలైన బుడుగుల, ఖమ్మం తోగు, బుగ్గ గ్రామాల్లో సోమవారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జ్వరాలు ఉన్న వారి నుండి రక్త నమూనా సేకరించి మందులు అందజేశారు. జ్వరాలు రాకుండ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని , నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలని, దోమ తెరలు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిశాంత్, సూపర్ వైజర్ పుష్పారాణి , రాంప్రసాద్, ఉమేష్, సుజాత, కౌసల్యా, శ్రావణి, రాధ, రమణ ,దుర్గా భవాని, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.