- బిజెపి మతోన్మాదా విధానాల పై పోరాడడమే రవీందర్ కి ఇచ్చే ఘన నివాళి
అమరజీవి కామ్రేడ్ రవీందర్ రెండవ వర్ధంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి- అన్నవరపు కనకయ్య
మన్యం న్యూస్.ములకలపల్లి. జనవరి 09….మతోన్మాద బిజెపి ప్రభుత్వా విధానాలపై ప్రజలు పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు.మండల కేంద్రంలోని చౌవిటిగూడెం గ్రామంలో తానం రవీందర్ స్ధూపం వద్ద అమరజీవి కామ్రేడ్ తానం రవీందర్ రెండో వర్ధంతి సందర్భంగా సోమవారం సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ తానం రవీందర్ మండలంలో పోడు భూముల పోరాటాలలో జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. కరోనా సమయంలో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ,అదేవిధంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించారాని అన్నారు. రవీందర్ ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. మతతత్వ బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దార దత్తం చేస్తున్నా, రాజ్యాంగంలో ఉండబడిన హక్కులను, చట్టాలను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం పై ఉద్యమాలు, పోరాటాలు ఉదృతం చేయాలని అన్నారు. దేశంలోని లౌకికవాద ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు,తానం రాంబాబు, రావూజ,పోడియం వెంకటేశ్వర్లు ,నిమ్మల తదితరులు పాల్గొన్నారు.