మన్యం న్యూస్, అశ్వరావుపేట, జనవరి 10:..నియోజకవర్గంలో పలువురు ఆహ్వానం మేరకు వైఎస్ఆర్టిపి జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం 2023 నూతన సంవత్సర క్యాలెండర్లను మంగళవారం ఆవిష్కరించారు. అశ్వరావుపేట పట్టణంలో ఐక్యత ప్రెస్ క్లబ్ క్యాలెండర్ ఆవిష్కరణ, దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో ప్రజాతంత్ర, ఆంధ్రప్రభ క్యాలెండర్లు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధి పాత్రికేయులని, మంచి చెడులను నిరంతరం ప్రజలకు తెలియజేస్తున్న పాత్రికేయ వృత్తి గొప్పదని వివిధ పత్రికల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల పాత్రికేయులు పాల్గొన్నారు.