మన్యం న్యూస్ గుండాల జనవరి 10…: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన రేంజర్ చలమల శ్రీనివాస్ జ్ఞాపకార్థం అటవీ శాఖ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు ఇల్లందు డివిజన్ పరిధిలోని గుండాల, కాచనాపల్లి, కొమరారం, ఇల్లందు రేంజ్ పరిధి వాలీబాల్ క్రీడలను అట్టహాసంగా మంగళవారం గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, సీఐ కరుణాకర్, రేంజర్ మురళి ప్రారంభించారు. మొదటి బహుమతి 10,116, రెండవ బహుమతి 8,116, మూడో బహుమతి 5,116, నాలుగో బహుమతి 3,116 అందిస్తున్నట్లు గుండాల రేంజర్ మురళి పేర్కొన్నారు ఈ క్రీడలలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. క్రీడాకారులు ఎటువంటి ఎంట్రీ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు క్రీడాకారులు పాల్గొన్నారు