UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 మంత్రి కేటీఆర్ తో ఉన్న చనువుతో ఇన్ని రోజులు పార్టీలో కొనసాగా…

మంత్రి కేటీఆర్ తో ఉన్న చనువుతో ఇన్ని రోజులు పార్టీలో కొనసాగా…
– నేను సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల వాడిని కాదు.
– ఉన్న ఇద్దరు గన్ మెన్ లను వెనక్కి తీసుకోండి.
– డబ్బులు లేకపోయినా జోలె పట్టుకొని అడుక్కొని రాజకీయం చేస్తా.
– ఉద్రేక భరితమైన మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి.

మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10: రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో ఉన్న చనువుతో ఇన్ని రోజులు పార్టీలో కొనసాగానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మణుగూరు మండలం తోగ్గూడెం సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నేను సంక్రాంతికి వచ్చిన గంగిరెద్దుల వాడిని కాదని, లక్షల మంది అభిమానం చూరగొన్న వ్యక్తిని అన్నారు. మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించానని, రైతుగా వ్యవసాయం కూడా చేశారన్నారు. తన కుటుంబంలో ఏ ఒక్కరు రాజకీయాలు చేయలేదన్నారు. ప్రత్యేకంగా రాజకీయంలో నాకు గాడ్ ఫాదర్ ఎవరు లేరని, రాష్ట్ర ప్రజలే నా గాడ్ ఫాదర్లు అన్నారు. చిన్న కాంట్రాక్టర్ గా క్రమక్రమేనా దేవుడి దీవెనలతో దిన దిన అభివృద్ధి చెంది వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టర్ గా నాలుగు రూపాయలు సంపాదించుకున్నానన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలు తండ్రి కొడుకుల బంధంగా పనిచేశానని, ప్రేమను పంచాలని చూశానని, నాకు ఏ ప్రేమ దక్కింది, ఏ గౌరవం దక్కిందన్నారు. మీకు ఒక అవకాశం వస్తుందని, మీకు ప్రేమాభిమానాలు ఉంటాయని, మీ ఆలోచనకు తగ్గట్టుగా నడుచుకుంటానన్నారు. నా వ్యాపారం గురించి, నా వ్యాపార లావాదేవీల గురించి, నాకు ఏం మేలు జరిగింది టైం వచ్చినప్పుడు చెప్తాను అన్నారు. ఫిబ్రవరి 19 ..2013 వ సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టానన్నారు. ఈ మధ్యలో కొంతమంది పినపాక లోకి ఏం పని అంటున్నారని, ఏ రోజైతే రాజకీయాల్లో అడుగు పెట్టానో ఆనాడే పినపాక నియోజకవర్గం లో అడుగు పెట్టానన్నారు. ప్రజల కోసం వచ్చానని, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి వచ్చానన్నారు. నాకు ఏం జరిగింది, నాతో ప్రయాణించే నాయకులకు ఏం జరిగిందో ప్రజలందరూ చూశారన్నారు. ఎన్ని ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా నమ్ముకున్న వారికోసం మీతోనే ఉంటానని, మీతోనే నడుస్తానన్నారు. ఒకటవ తారీఖున నేను చెప్పిన మాటలకు మీరు అంతా బాధపడి ఉంటే, గడిచిన నాలుగు సంవత్సరాలలో మేము ఎంత బాధపడి ఉంటామో అర్థం చేసుకోవాలన్నారు. కొందరికి ప్రేమించడం, ఓదార్చడం తెలియదని, కష్టాల్లో ఉన్నవారికి భరోసా ఇవ్వడం తెలియదన్నారు. పదవులు ఇచ్చిన ఇవ్వకపోయినా మనిషిని మనిషిగా ప్రేమగా చూడాలన్నారు. ఇవన్నీ ఎవరైనా చేస్తే వారిని ఒంటరిని చేసి విమర్శించడానికి గద్దల్లా వస్తున్నారన్నారు. నాకు గన్ మెన్ లను ఇవ్వమని నేను అడగలేదని, ఇప్పుడు తీసేసిన నేనేమీ బాధపడడం లేదని, ఉన్న ఇద్దరిని కూడా తీసివేసిన ఏమీ నొచ్చుకోనన్నారు. నేను కష్టపడి డబ్బు సంపాదించుకున్నానని, సంపాదించిన దాంట్లో నా కుటుంబం కంటే నన్ను నమ్ముకున్న కుటుంబ సభ్యుల మధ్య ఖర్చు పెడుతున్నానన్నారు. ప్రతి రూపాయికి ఇన్కమ్ టాక్స్ కట్టే ఆ డబ్బునే మీకు పంచుతున్నానన్నారు. నేను ఎన్ని వేల కోట్ల పనులు చేశానో, ఎంత సంపాదించానో పద్దులతో సహా ప్రతి వర్క్ గురించి వివరంగా చెప్తానన్నారు. తనకు ఆర్థిక ఇబ్బంది వచ్చిన రోజు జోలె వేసుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో తిరిగి నన్ను అభిమానించే నాయకులని చందాల రూపంలో అడుక్కొని రాజకీయం చేస్తానన్నారు. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చినా భరిస్తానని, ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తుళ్లూరి బ్రహ్మయ్య, ము వ్వ విజయ్ బాబు, ఆదినారాయణ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !