UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 మిత్రుని జ్ఞాపకార్ధంగా లక్ష్మీపురం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

 

మన్యం న్యూస్ బూర్గంపహాడ్ జనవరి 10 మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో మిత్రుడు సతీష్ రెడ్డి జ్ఞాపకార్ధంగా లక్ష్మీపురం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో సతీష్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం నిర్వహించడం జరిగింది. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, పిఏసిఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డిలు హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. కార్యక్రమం
అనంతరం జడ్పీటీసీ శ్రీలత మాట్లాడుతూ మిత్రుని జ్ఞాపకార్థంగా లక్ష్మీపురం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా గొప్ప విషయమని వారి మిత్రులను కొనియాడారు. తమ చిన్ననాటి స్నేహితున్ని మర్చిపోకుండా కలకాలం గుర్తుంచుకునేందుకు అతని పేరుతో ప్రతియేటా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాల సంతోషకరమైన విషయమని వారి మిత్ర బంధాన్ని అభినందించారు. అలాగే క్రిడలు అనేవి యువతలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసి వారి ప్రతిభను ప్రపంచ నలుమూలలు చాటిచెప్పడానికి దోహదపడతాయని తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ గ్రామ కమిటి అధ్యక్షులు పోతిరెడ్డి గోవింద రెడ్డి, స్థానిక వార్డుసభ్యులు పాలం దివాకర్ రెడ్డి, చింతా వెంకట్రామిరెడ్డి, స్థానికులు ఆవుల నాగార్జున రెడ్డి, కటుకూరి వెంకన్న, ఆర్గనైజింగ్ సభ్యులు బాదం గణేష్ రెడ్డి, యారం పున్నారెడ్డి, చగర్లమూడి, జగదీష్ దుగ్గు శ్రీనివాస రెడ్డి, దుగ్గు రాజశేఖర్ రెడ్డి, పడిదెల శ్రీను, బందెల శ్రీను, పాలం ప్రకాష్ రెడ్డి, పేరం సంజీవ రెడ్డి, బొడ్డు రామాంజి రెడ్డి, ఆవుల పవన్ కుమార్ రెడ్డి, బిజ్జం అంజిరెడ్డి, ఉమ్మలరెడ్డి, బాలశేఖర్ రెడ్డి, యారం పూర్ణ చందర్ రెడ్డి, యల్లాంకి నాగేశ్వర్ రావు, ఆలేటి వెంకటేష్(గిరి),జక్క కార్తిక్ ,కన్నెకంటి యాకుబ్ రెడ్డి క్రిడాకారుల తదితరులు పాల్గొన్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !