మన్యం న్యూస్ ,కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఐదవ మహాసభలను విజయవంతం చేయాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి బి రాము అన్నారు. ఈ సందర్భంగా ఆయనమండల పరిధిలోని చిరుమల్ల లో మాట్లాడుతూ ఈనెల 13,14వ తేదీలలో రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిర్వహిస్తున్న విద్యా సదస్సుకు ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,కేరళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కే.కే శైలజ పాల్గొని ప్రారంభ ఉపన్యాసం చేస్తారని తెలిపారు.అలాగే ప్రముఖ విద్యావేత్త చుక్క.రామయ్య,మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి.నర్సిరెడ్డి, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కే.జంగయ్య ,చావ రవి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు యుటిఎఫ్ కార్యకర్తలు ఎస్. కృష్ణకుమారి, బి.రమేష్, కోటయ్య ,రామారావు ,సంపత్ సురేష్ ,హతిరామ్ ,గణపతి పాల్గొన్నారు.