వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ సదస్సుకు సాంబశివరెడ్డికి ఆహ్వానం….
తెలంగాణ రైతు బిడ్డకి జీ 20 దేశాల ప్రతినిధుల పక్కన కూర్చునే అరుదైన గౌరవం….
గొప్ప గౌరవాన్ని ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటా….
జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…
మన్యం న్యూస్, మంగపేట.
భారత కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని ముంబాయి నగరంలో ఫిబ్రవరి 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వరల్డ్ స్పైసెస్ కాంగ్రెస్ సదస్సుకు హాజరుకావాలని భారత ప్రభుత్వం నుండి జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డికి మంగళవారం ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా నాసిరెడ్డి సాంబశివరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్పైసెస్ కాంగ్రెస్ సదస్సుకు హాజరు కావాలని భారత ప్రభుత్వం నుండి తనకు ఆహ్వానం రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.జి 20 దేశాల ప్రతినిధుల మధ్య కూర్చునే అరుదైన అవకాశం కల్పించటం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. తనను ఈ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించిన ఘనత ఈ ప్రాంత రైతులదేనని వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని సాంబశివరెడ్డి తెలిపారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని తనకు కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి సాంబశివరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో సుగంధ ద్రవ్యాల ఎగుమతి దారులు ప్రాసెసర్సు, కార్పొరేట్ పారిశ్రామిక సంస్థలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని సాంబ శివ రెడ్డి తెలిపారు.సాంబశివరెడ్డికి వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ లో పాల్గొనే అవకాశం రావడం పట్ల రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.