మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10: పినపాక నియోజకవర్గం లోని మణుగూరు మండలం తొగ్గూడెం సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద మంగళవారం పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఒక్క ఫ్లెక్సీలో కూడా బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు, మంత్రి కేటీఆర్ ఫోటోలు కనిపించలేదు. దీంతో పొంగులేటి పార్టీ మారుతున్నాడు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది.
