మన్యం న్యూస్ : జూలూరుపాడు, జనవరి 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ నెల 18న ఖమ్మం గుమ్మంలో జరగబోయే బిఆర్ఎస్ తొలి సభను విజయవంతం చేయాలని ఆదోల్ ఎమ్మెల్యే, ఖమ్మం సభ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ క్రాంతి కిరణ్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన రెండు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సాధనకు పురుడుబోసిన చరిత్ర ఖమ్మానికి దక్కుతుందన్నారు. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా అవతరించిన తరువాత మొదటి సభ ఖమ్మంలో నిర్వహించడం రానున్న రోజుల్లో బిఆర్ఎస్ విజయానికి సంకేతం అన్నారు. 70 ఏళ్లుగా కానరాని అభివృద్ధిని కేవలం 9 సంవత్సరాలలో సాధించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కి దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలనే బిఆర్ఎస్ పార్టీని స్థాపించారని అన్నారు. ఖమ్మంలో జరగబోయే బిఆర్ఎస్ తొలి సభ కు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాదిమంది తరలి వస్తున్నారని, ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు సభకు హాజరయ్యేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కళావతి, ఎంపీపీ సోనీ, సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సతీష్ కుమార్, సీనియర్ నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, శెట్టిపెళ్లి వెంకటేశ్వరరావు, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





