UPDATES  

 సంక్రాంతి పండుగ సాంప్రదాయాలకు ప్రతీక

 

మన్యం న్యూస్ చండ్రుగొండ , జనవరి 12: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీక అని సెయింట్ జోషప్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇమ్మల్డా అన్నారు. గురువారం స్థాయిక సెయింట్ జోషప్ పాఠశాలలో సంస్కృతి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మన పండుగల గొప్పతనాన్ని భావితరాలకు అందించాల్సిన భాద్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లలిత, సుజాత, మునీర్, రాణి, భాస్కర్, నరేష్, అనూష, సిస్టర్ఆశా, రేష్మా, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !