మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి 14: మండల పరిధిలోని గుర్రాయిగూడెం గ్రామ శివారులో పేకాడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి శనివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి… గ్రామ శివారులోని గుడిసెలో పేకాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయగా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పేకాడతున్నందుకు గాను వీరిపై కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో పేకాట, కోడి పండేలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు.