మన్యం న్యూస్ చండ్రుగొండ జనవరి 18 : మండల పరిధిలో గల అన్ని గ్రామపంచాయతీలలో నుంచి గులాబీ సైన్యం మండల అధ్యక్షుడు ధారా బాబు, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మండల కేంద్రం లో భారీ ర్యాలీతో ఖమ్మం భారీ బహిరంగ సభకు గులాబీ సైన్యంతో బయలుదేరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ… దేశ రాజకీయాలలో మార్పు కోసం బిఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి భారీ బహిరంగ సభకు గులాబీ సైన్యంతో విజయవంతం జరిగిద్దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మేడ మోహన్ రావు, చీదెళ్ల పవన్ కుమార్, భూపతి రమేష్,భూపతి శ్రీనివాసరావు,సయ్యద్ రసూల్, సత్తి నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పాల్గొన్నారు.