మన్యం న్యూస్ : జూలూరుపాడు, జనవరి 19, , మన్యం న్యూస్ తెలుగు డిజిటల్ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ గురువారం ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని అనంతారం గ్రామపంచాయతీ ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మండల ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మన్యం న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యేకి, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మన్యం న్యూస్ పత్రిక ప్రతినిధి సంఘం నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.