UPDATES  

 1/70 చట్టం జోలికి వస్తే ఏజేన్సీ నుంచి తరిమికొడతాం ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 20 …..భారత రాజ్యాంగంలోని 5 వ షెడ్యూల్ భూభాగం ఆదివాసుల రక్షణకై హక్కులకై ఏర్పడిన 1/70 చట్టం ఎత్తివేయాలని వలస గిరిజనేతరులు సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు 1/70 చట్టం జోలికొస్తే గిరిజనేతరులను ఏజెన్సీ నుంచి తరిమికొడతామని ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, రాజ్యాంగంలోని 5 వ షెడ్యూల్డ్ భూభాగం కు ప్రత్యేకమైన అధికారాలు ఆదివాసులకు హక్కులు,చట్టాలు ఉన్నాయని 1970 తర్వాత వచ్చిన కొంతమంది వలస గిరిజనేతరులు ఏజెన్సీలో ఉన్న అపారమైన వనరులు దోపిడీ చేయుటకు 1/70 అడ్డంకిగా ఉందనే భావనతోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని, ఇప్పటివరకు 1/70 చట్టం ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో 90 సార్లు గిరిజనేతరులు పిటిషన్ లు వేశారని వారందరికీ కోర్టులో చుక్కైదురు అయిందన్నారు. గిరిజనేతరుల హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆరోపిస్తున్న వారు అదే గిరిజనేతరులకు ఏ విధంగా 2017 లో సాదా బైనామాలు పట్టాలు పొందారో..? ఏజెన్సీ వ్యాప్తంగా అక్రమ బహుళ అంతస్తులు నిర్మాణాలు, వ్యాపారాలు, స్థిరాస్తులు, రాజకీయ పదవులు ఏ విధంగా అనుభవిస్తున్నారో గిరిజనేతరులే సమాధానం చెప్పాలన్నారు.1/70 చట్టం తొలగించడం గిరినేతరుల తరం కాదనీ ఆయన జోష్యం చెప్పారు. ఆదివాసుల హక్కులు చట్టాలు అమలుకై మరోసారి మరో క్విట్-ఏజెన్సీ కై కొట్లాడుతామన్నారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టి శ్రీనివాసరావు, జేఏసీ నాయకులు తాటి పుల్లయ్య, విద్యార్థి కన్వీనర్ కలివేటి ప్రవీణ్, వజ్జ శ్రీను,వాడే రామకృష్ణ, కంగల వసంత్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !