మన్యం న్యూస్ జనవరి 22 వాజేడు. సెంట్రల్ రిజర్వే పోలీస్ ఫోర్స్ 58/ఏ బెటాలియన్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ కార్యక్రమాన్ని ఆలు బాకా గ్రామంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్,వాజేడు మండలం పేరూరు, ఎస్సై హరీష్ పాల్గొని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు,నోటు పుస్తకాలు, ఆట పరికరాలు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదిలక్ష్మి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, విద్యార్థులు పాల్గొన్నారు.
