సింగరేణి ప్రీమియరీ ఎక్స్ ఫ్లో జివ్స్ వర్కర్ల నిరవధిక సమ్మె
కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఆర్.లక్ష్మీనారాయణ
మన్యం న్యూస్ మణుగూరు టౌన్
మణుగూరు సింగరేణి ప్రీమియర్ ఎక్స్ క్లూజివ్ కార్మికులు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం నుండి కార్యాలయం ముందు నిరవధిక సమ్మెకు దిగారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఆర్ లక్ష్మీనారాయణ కార్మికుల పక్షాన నిలబడి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ,గత రెండు సంవత్సరాలుగా కార్మికులకు వేతన ఒప్పందం అమలు చేయకుండా,మేనేజ్ మెంట్ కాలయాపన చేస్తుందన్నారు. ఏఐటీయుసీ నాయకత్వాన అనేక సార్లు మేనేజ్ మెంట్ వారు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదని వారి కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.నవంబర్ 1వ తేదీన యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని,అధికారులకు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్,లేబర్ కమిషనర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు వారు వివరించారు.యాజమాన్యం సమస్యల గురించి మాట్లాడితే పట్టించుకోవడంలేదని,అందుకే కార్మికులు విసుకు చెంది సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు.ఇకనైనా యాజమాన్యం దిగివచ్చి కార్మికులతో చర్చలు జరిపి, సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఏఐటియు సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతాయని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల అధ్యక్షులు తోట రమేష్,కార్యదర్శి అక్కి. నరసింహారావు,జిల్లా సమితి సభ్యులు ఎస్ కె సర్వర్,సొందే కుటుంబరావు,మంగి వీరయ్య, కార్మికులు ఎర్రయ్య,యాకయ్య, బుచ్చి రాములు, అశోక్, బాబురావు,కార్మికులు పాల్గొన్నారు.