మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 26: మండలంలోని కృష్ణసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని దేవయ్య గుంపు, గంగారాజు గుంపులకు చెందిన ఆదివాసీ పిల్లలకు 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం లక్ష్మిపురంలోని రాజ్యలక్ష్మి ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో సమకూర్చిన పండ్లు, స్వీట్లు పంపిణీ చేసిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మిపురం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పాలం దివాకర్ రెడ్డి, లక్ష్మిపురం యూత్ సభ్యులు యారం పున్నారెడ్డి, పాలం ప్రకాష్ రెడ్డి, పేరం సంజీవ రెడ్డి, చాగర్లమూడి జగదీశ్, దగ్గు శ్రీనివాస రెడ్డి, ఉమ్మలరెడ్డి బాలశేఖర్ రెడ్డి, దాసరి దర్గయ్య, మడకం రాజా, హరీష్, గ్రామ పెద్దలు పద్దం రాజు, మడకం దేవ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.