మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 26: రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించిన అధికారులకు అవార్డులను అందజేస్తుంది. ఇందులో భాగంగా మణుగూరు తహసిల్దార్ నాగరాజు గురువారం కొత్తగూడెంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ఉత్తమ అధికారి అవార్డును అందుకున్నారు.
-మున్సిపాలిటీ కార్మికులకు అవార్డులు….
మణుగూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు దక్కాయి. పారిశుధ్య కార్మికురాలు కనకమ్మ, వాటర్ మెన్ నర్సింహారావు ,అటెండర్ కోటి ,ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ రమేష్, బిల్ కలెక్టర్ కేశవరాజులు రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ఉత్తమ అధికారి అవార్డును అందుకున్నారు.