మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి జనవరి 26: అన్నపురెడ్డిపల్లి మండలంలో ఎంపిడివో గా విధులు నిర్వర్తిస్తు మండలంలోని గ్రామ పంచాయతీల రూపు రేఖలను మారుస్తూ అభివృద్ధి కోసం నిరంతరం మండల వ్యాప్తంగా కృషి చేస్తున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారిని జి. రేవతి ఉత్తమ ఎంపీడీవో గా ఎంపికయ్యారు.74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరంచుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అనుదిప్ దురిశేట్టి,ప్రభుత్వ విప్,పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు చేతుల మీదుగా ఉత్తమ అధికారిగ అవార్డ్ ను అందుకున్నారు.అనంతరం ఎంపిడివో మాట్లాడుతూ ఈ అవార్డ్ రావడానికి కృషి చేసిన మండల పంచాయతీ అధికారికి,పంచాయతీ సెక్రటరీలకు,ఉపాధి హామీ పథకం స్టాఫ్ అందరికి కృత్ఞతలు తెలిపారు.
