మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 26: మణుగూరు మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలు, విద్యాసంస్థలు, వివిధ అసోసియేషన్లు గణతంత్ర వేడుకలను నిర్వహించారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మణుగూరు డిఎస్పీ, పోలీస్ స్టేషన్, ఎంఈఓ, ఐకెపి, ఈజిఎస్, అగ్రికల్చర్, పంచాయతీ, ఏరియా జీఎం కార్యాలయాల్లో, జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు తదితరులు పాల్గొన్నారు.