మన్యంన్యూస్, అశ్వారావుపేట, జనవరి, 26: అశ్వారావుపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ జెండాను ఎగురవేశారు. అదే విదంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నీ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, జడ్పీటీసీ వరలక్ష్మి, వైస్ ఎంపీపీ ఫణీంద్ర, మోహన్ రెడ్డి, మండల, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.