విద్యుత్ శాఖ కార్యాలయంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
*మొదటిసారి జాతీయ జెండా ఎగరవేయ్యడం ఆనందంగా ఉంది విద్యుత్ శాఖఏఈ కావ్య
మన్యం న్యూస్, పినపాక:
మండలంలోని ఏడూళ్ళ బయ్యారం విద్యుత్ శాఖ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవలనే ఏఈ గా నియమితులైన కావ్య జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొదటిసారి జాతీయ జెండాను ఎగురవేయడం చాలా సంతోషంగా ఉందని, జెండాను ఎగురవేయడం పట్ల గర్వపడుతున్నానని తెలియజేశారు. మన హక్కుల కోసం, మనం రచించుకున్న రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు గౌరవం కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ వీరారెడ్డి, ఫోర్ మెన్ రాఘవేంద్రరావు, సీనియర్ లైన్మెన్ రామకృష్ణ, లైన్ ఇన్స్పెక్టర్ అశోక్, అహ్మద్, లైన్ మెన్ చారీ, జూనియర్ లైన్మెన్ జావీద్, నాగరాజు, మూర్తి, మురళీకృష్ణ పాల్గొన్నారు.