మన్య న్యూస్ చర్ల జనవరి 26 :
గణతంత్ర దినోత్సవ సందర్భంగా చర్ల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షులు సోయం రాజారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ బృందం రాసిన వంటి భారత రాజ్యాంగం అమలులో వచ్చిన సందర్భంగా మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ద్వారా మన స్వేచ్ఛ జీవితాన్ని గడపవచ్చు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, బిసి సెల్ అధ్యక్షుడు దొడ్డి సూరిబాబు,యుత్ అధ్యక్షుడు కాకి అనిల్, రైతు బంధు సమితి క్లస్టర్ తోటపల్లి మాధవరావు, పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు,తడికల లాలయ్య,అజీజ్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పంజా రాజు, తోటమల్ల రవి, కోంభతిన రాము, తడికల బుల్లబ్బాయి, కోంగూరి సోమరాజు, రావుల కిషోర్,అంబోజి సతీష్, గంపల రమేష్, ముఖ్య నాయకులు కార్యకర్తల పాల్గొనటం జరిగింది.