UPDATES  

 భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బిజెపి

భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బిజెపి

దేశ సంపదను అంబానీ, ఆధానీలకు దోచిపెడుతున్న మోడీ

కాయ కష్టం చేయకుండ అంభానీ, ఆధానీలు లక్షల కోట్లు ఎట్లా సంపాదించిండ్రు?

మోడీ పాలనలో పెరిగిపోతున్న ఆర్ధిక అసమానతలు

హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో బిజెపి సర్కార్ పై భట్టి ఫైర్

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తా: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
దేశ ప్రజల అందరికి సమానమైన హక్కు, ఆత్మగౌరవాన్ని కల్పించిన భారత రాజ్యంగానికి కేంద్రంలోని బిజెపి పాలకులు తూట్లు పొడుస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ద్వారా భారత రాజ్యాంగాన్ని రూపొందించకుంటే ఇప్పుడు దేశంలో సామాన్యులు బ్రతికే పరిస్థితి ఉండేది కాదన్నారు. గురువారం ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, ఎర్రుపాలేం మండలంలోని మామునూర్ గ్రామాంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి రాహుల్ గాంధి చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉద్దేశ్యాన్ని, విభజన రాజకీయాలతో దేశంలో రాజాకీయ లబ్ధి పొందాలని మతం పేరిట బిజెపి చేస్తున్న దుశ్చర్యలను వివరించారు. ఆనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. “దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ దేశ పౌరుడే. దేశ ప్రజలందరికి సమానమైన అవకాశాలు కల్పించాలని, ప్రజలు అందరు సమానంగా ఎదుగాలని, దేశ ప్రజలు మొత్తం ఒక జాతిగా ఎదిగి ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడాలన్న మంచి ఉద్దేశ్యంతో ఈ దేశానికి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని” అందించిందని” అన్నారు. కానీ ఆనేక మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి, లౌకిక వాదాన్ని పక్కన పెట్టి, మతం పేరిట ప్రజలను విడగొట్టి, ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్యన వైషమ్యాలను పెంచుతూ, రాజకీయ లబ్ధి పొందడానికి రక్తపాతానికి బిజెపి పాలకులు దారి తీస్తున్నారని
ఆందోలన వ్యకం చేశారు. బిజెపి విచ్చిన్నకర రాజకీయాలతో దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తున్న నేపత్యంలో ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా రాహుల్ గాంధి దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కొరకు, లౌకికవాదాన్ని నిలబెట్టడానికి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పటికీ లెక్కచేయకుండ దేశ ప్రజల బాగు కొరకు సాహోసోపేతమైన నిర్ణయం తీసుకొని కన్యకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా నిర్వహిస్తున్నాడని వివరించారు. రాహుల్ యాత్రకు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ప్రతి అడుగులో ప్రజలు భాగస్వామ్యం అయ్యారని వెల్లడించారు. రాహుల్ చేపట్టిన భారత్ జూడో యాత్రకు కొనసాగింపుగానే రెండు నెలలపాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించి బిజెపి పరిపాలనకు చరమగీతం పాడనున్నారని తెలిపారు.

దేశ సంపదను కార్పోరేట్లకు దోచిపెడుతున్న మోడీ
మతం పేరిట విభజన రాజకీయాలు చేస్తూ దేశ సంపదను ప్రధాని తన స్నేహితులైన అంభానీ, ఆధానీలకు దారదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈదేశ సంపదను గుజరాతీ కార్పోరేట్లకు దోచి పెట్టే పనిలోనే ఉన్నారని విమర్శించారు. కాయ కష్టం చేయకుండ అంబానీ, ఆధానీలు లక్షల కోట్లు ఎట్లా సంపాదించారని ప్రశ్నించారు. 8సంవత్సరాల క్రితం సామాన్య వ్యాపార వేత్తగా ఉన్న ఆధానీ ప్రపంచంలో రెండవ కుభేరుడుగా ఎదగడం వెనుక దేశ సంపదను ప్రధానీ మోడీ అతనికి దోచి పెట్టడం వల్లనే సాధ్యమైందన్నారు. కేంద్రంలోని బిజెపి పాలకులు కార్పోరేట్లకు దేశ సంపదను దోచి పెట్టడం వల్ల ప్రజల మధ్యన ఆర్ధిక ఆసమానతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నవాడు ( సంపన్నులు) లేని వాడు( పేదలు)గా దేశం రెండుగా విభజించపడుతున్నదన్నారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు.

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపిస్తా..
పీపుల్స్ మార్చ్, హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తు గురించి వచ్చే నెల 3వ తేది నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. విద్య, వైద్యం, ఇండ్లు, ఇంటి స్థలాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి, మౌలిక వసతి తదితర సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కారించాలని ప్రజల గొంతుకగా అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తానని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతి ఏటా ప్రవేశపెట్టేటువంటి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజా సమస్యలు తీర్చేవిగా ఉండాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు అసెంబ్లీ వేదికగా ప్రభుతంపై ఒత్తిడి పెంచుతానని ప్రకటించారు.

మిర్చి రైతులతో ముచ్చటించిన భట్టి
హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా మామునూరు గ్రామంలో మిర్చి రైతులతో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ముచ్చటించారు. మిర్చి పంట పెట్టుబడి దిగుబడి వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర పెట్టిన పెట్టుబడికి సరిపోతుందా అని అడిగారు. విత్తనాలు వేసినప్పటి నుంచి పంట దిగుబడి వరకు ఎదుర్కొన్న ఇబ్బందులను, విత్తన ఎరువుల సమస్యల గురించి రైతులను అడిగి ఆరా తీశారు. మిర్చి రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడతారని రైతులకు హామీ ఇచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !