మన్యం న్యూస్ మణుగూరు టౌన్, జనవరి 30
మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన కాటిబోయిన.ఆదేమ్మ(80) ఖమ్మం జిల్లా,మధిర తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కాటిబోయిన అభిరామ్ తల్లి కాటిబోయిన.ఆదేమ్మ సోమవారం తెల్లవారుజామున మరణించారు.విషయం తెలుకొని మణుగూరు జడ్పీటీసీ పోశం. నరసింహరావు,మణుగూరు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యాంబాబు వారి ఇంటికి వెళ్లి వారి పార్థివదేహానికి పూలమాల వేసి,సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన వెంట కూనవరం గ్రామపంచాయతీ సర్పంచ్ ఏనిక ప్రసాద్,భూర్గంపహాడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని బాబురావు, గుడిపూడి. కోటేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దంగుల కృష్ణ,మడి వీరన్నబాబు సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు