మన్యం న్యూస్,భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని సోమవారం అయ్యప్ప స్వామి టెంపుల్ వద్ద ఓ వ్యక్తి అపార స్థితిలో ఉన్నారనే సమాచారం తో అయ్యప్ప స్వామి గుడిలో పనిచేస్తున్నటువంటి వాసు నాగరాజు కి సమాచారం రావడం జరిగింది. తక్షణమే స్పందించిన నాగరాజు ఆ పెద్దాయన వివరాలు సేకరించి అనంతరం 108 ద్వారా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి ఫస్ట్ ఎయిడ్ చేయించాడుఅనంతరం గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు పెద్దాయనను వారి కుటుంబ సభ్యులకు నాగరాజు అప్పగించి మానవత్వం చాటుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న పెద్దాయన్ని ఎవరూ పట్టించుకోలేని పరిస్థితులలో నిత్య సేవకుడు కనాలి నాగరాజు మానవత్వంతో స్పందించిన తీరు ,ఆయన సేవ అమోఘం అని పలువురుకొనియాడారు.