టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు ఎన్ఎన్ రాజు వివాహానికి హాజరైన ఎమ్మెల్యే రేగా దంపతులు….
మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి03: టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు ఎన్ఎన్ రాజు వివాహం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు, ఆయన సతీమణి సుధారాణి లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు ఎంపీ జోగినపల్లి సంతోష్ వివాహానికి హాజరయ్యారు.
