UPDATES  

 సిఐటియు పోరాట ఫలితంగానే మధ్యాహ్న భోజన వర్కర్లకు వేతన జీవో విడుదల

మన్యం న్యూస్ కరకగూడెం: సిఐటియు విస్తృత పోరాటాల ద్వారానే మధ్యాహ్న భోజన వర్కర్లకు 3000 రూపాయల వేతన జీవో సాధించుకోవడం జరిగిందని సిఐటియు నాయకులు కొమరం కాంతారావు శనివారం తెలిపారు. మధ్యాహ్నం భోజన కార్మికులందరూ సమిష్టిగా సిఐటియు ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాల నుంచి విస్తృత పోరాటాలు నిర్వహించిన ఫలితంగానే మూడు వేల రూపాయల జీవో విడుదల సాధించుకోవడం జరిగిందని గత సంవత్సరం హామీ ఇచ్చిన నాటి నుండి అమలు చేసి తక్షణం వేతనాలు విడుదల చేయాలని కోరారు. అలాగే మెనూ చార్జీలు పెరిగిన ధరలు కనుగుణంగా పెంచి గుడ్లను అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేసినట్టుగా టెండర్ విధానం ద్వారా ప్రతి పాఠశాలకు అందించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు యూనిఫామ్, వంట పాత్రలు, రక్షణ పరికరాలు కొబ్బరి నూనె తదితర వస్తువులు ప్రభుత్వం నేరుగా అందించాలని, మధ్యాహ్న భోజన రంగంలో ప్రధాన సమస్యల పరిష్కారం కొరకు మరిన్ని పోరాటాలకు కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలు నిర్వహించేలా సిద్ధపడాలని పోరాటాల ద్వారానే మన సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మధ్యాహ్న భోజన రంగం జిల్లా కమిటీ సభ్యులు భద్రకాళి, సావిత్రి, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !