మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో దుమ్ముగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని మాజీ మంత్రి బి ఎస్ ఆర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కోరారు. దుమ్ముగూడెం గ్రామంలో వెలిసిన గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 22వ జాతర మహోత్సవంలో శనివారం ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చుక్కా గణేష్ రెడ్డి కమిటీ సభ్యులు బిఎస్ఆర్ పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నూతనంగా నిర్మించిన శ్రీ సీతాలత అమ్మవారి( శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి) కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను మంత్రిగా పనిచేసిన పర్యాయాలలో ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశానని అన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి తాను అడిగిన వెంటనే ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించారని సీతారామ ప్రాజెక్టు ఆవశ్యకతని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తాను తీసుకువెళ్లగా వెంటనే మంజూరు చేసి నిధులు కేటాయించి అనుమతులు ఇచ్చి ప్రారంభించారని ఈ బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణం వల్ల విద్యుత్ ఉత్పత్తితోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీరు త్రాగునీరు అందించేందుకు ఎంతో ఉపయోగం జరుగుతుందని లక్షల ఎకరాలు భూమి సస్యశ్యామలం అవుతుందని అన్నారు ప్రగలపల్లి ఎత్తిపోతల పథకం రూపకల్పన పూర్తయిందని త్వరలోనే నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు తెలంగాణ చత్తీస్గడ్ రాష్ట్రాలను అనుసంధానం చేసే అంతర్రాష్ట్ర రహదారిని తాను మంత్రిగా ఉన్న సమయంలోనే నిర్మించడంతో ఈ ప్రాంతాల్లో రెండు రాష్ట్రాలకు రాకపోకలు సులభతరం అయ్యాయని అన్నారు. ముత్యాలమ్మ అమ్మవారి శ్రీ సీతా రామచంద్రుల వారి ఆశీస్సులతోఈ ప్రాంత అభివృద్ధికి ఇకముందు కూడా తన వంతు కృషి అందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఆలయ కమిటీ చైర్మన్ చుక్కా గణేశ్ రెడ్డి తో పాటు సిపిఎం నాయకులు యలమంచి రవికుమార్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మానే రామకృష్ణ, రసూల్, యండి అలీ ఖాన్, పెద నల్లబల్లి సర్పంచ్ మట్ట వెంకటేశ్వరరావు, ( శివాజీ) యశోద రాంబాబు, కొత్తూరి సీతారామారావు, వాగే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.





