మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 12…
మండల పరిధిలోని సింగిరెడ్డిపల్లి పంచాయతీలో ఇంటింటికి బీఆర్ఎస్ కార్యక్రమాన్ని సర్పంచు కొర్సా లక్ష్మీ రూపవతి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. పంచాయతీలోని ప్రతి గడపకు వెళుతూ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పథకాల ఫలాల గురించి వివరిస్తూ, ప్రచారం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆశా కిరణం అని, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, పేదలకు అండగా నిలుస్తున్న పార్టీ బిఆర్ఎస్ అని, సింగిరెడ్డిపల్లి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్లకొండ శ్రీను అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, సింగిరెడ్డిపల్లి బిఆర్ఎస్ నాయకులు రామయ్య, రవీందర్, చిన్నారి, ప్రవీణ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
